లెనొవొ ‘కె3 నోట్’@ 9,999

26 Jun, 2015 00:02 IST|Sakshi
లెనొవొ ‘కె3 నోట్’@ 9,999

విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లోనే
 
 న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా ‘కె3 నోట్’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 5.5 అంగుళాల హెచ్‌డీ తెర, 1.7 గిగాహెర్ట్జ్‌ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం నుంచి ప్రారంభ మయ్యింది.

మరిన్ని వార్తలు