లెనోవో సూపర్‌ ల్యాప్‌టాప్స్‌ : ‘థిన్‌ అండ్‌ లైట్‌’

14 Apr, 2018 10:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   చైనాకు  చెందిన ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ లెనోవో    భారీగా ల్యాప్‌టాప్‌లను, టాబ్లెట్ల (2018) ను  లాంచ్‌ చేసింది. ‘థిన్‌ అండ్‌ లైట్‌’ అంటూ ఎక్స్‌,ఎల్‌, టీ సిరీస్‌లలో ల్యాప్‌టాప్‌లు,  టాబ్లెట్లను భారతీయ వినియోగదారులకోసం  వీటిని  విడుదల చేసింది.  వినియోగదారులకు కోసం  థింక్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ మోడళ్లలో  లేటెస్ట్‌ 8 వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో సరికొత్త శ్రేణిలో  వీటిని ప్రారంభించింది. వీటిల్లో  థింక్‌పాడ్‌ ఎక్స్‌, టీ,  ఎల్‌ సిరీస్‌లో  పలు మోడల్స్‌ను లాంచ్‌ చేసింది.  ఎక్స్‌ సిరీస్‌లో  ఎక్స్‌ 1, ఎక్స్‌1 కార్బన్‌, ఎక్స్‌ 1 యోగా సహా ఇతర డివైస్‌లను  లాంచ్‌ చేసింది. ఐ ట్రాకింగ్‌ విత్‌ ఐ ఆర్‌ కెమెరా, సెక్యూరిటీ తమ  డివైస్‌ల ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.  ఇక ఆడియో, డిస్‌ప్లే విషయానికి వస్తే  డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌, 500నిట్స్‌ ఫీచర్లను జోడించింది.

డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌  సపోర్టుతో  మొట్టమొదటి థింక్‌ ఎక్స్‌1 కార్బన్‌, ఎక్స్‌ 1 యోగా డివైస్‌లను లాంచ్‌ చేసినట్టు కంపెనీ  చెప్పింది. అంతేకాదు ప్రపంచంలో అతి  తేలికైన 14 ఇంచెస్‌ బిజినెస్‌ ల్యాప్‌టాప్‌గా చెబుతోంది.  అల్ట్రా లైట్‌ కార్బన్‌ ఫైబర్‌ తో రూపొందించిన  ఈ డివైస్‌లో 1920 x 1080 రిజల్యూషన్‌, 16జీబీ ర్యామ్‌, 8వ జనరేషన్‌  ఇంటెల్‌కోర్‌ ప్రాసెసర్‌  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  ముఖ్యంగా14 అంగుళాల శ్రేణిలో అతి తక్కువ బరువు  వుండే  ఎక్స్‌ 1 ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ .1,21,000 నుంచి రూ.1,26,000 వరకు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ పెన్‌,  గ్లోబల్ ఎల్‌టీవీ సామర్ధ్యంతో వస్తున్న ఇది  ప్రపంచంలో ఏకైక​  కన్వర్టిబుల్ ల్యాప్‌టాప్‌గా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

థింక్‌ ప్యాడ్‌ ఎక్స్‌ సిరీసలో ఎక్స్‌ 280, ఎక్స్‌ 330 ధరలు  రూ. 73,000 నుండి రూ .87,000 వరకు ఉండనున్నాయి. ఎల్‌ సిరీస్‌లో ఎల్‌  580, ఎల్‌ 480, ఎల్‌ 380 ధరలు రూ .54,000 నుంచి రూ. 65,000 వరకు  ఉన్నాయి.  టీ సిరీస్లో, టీ 580 (74వేల రూపాయలు), టీ480ఎస్ ‌(86వేల రూపాయలు),  టీ 480 (69వేలు రూపాయలు) లను అందుబాటులో తెచ్చింది.

మరిన్ని వార్తలు