టయోటా ‘లెక్సస్‌’.. వచ్చేసింది!

25 Mar, 2017 00:53 IST|Sakshi
టయోటా ‘లెక్సస్‌’.. వచ్చేసింది!

మూడు మోడళ్ల ఆవిష్కరణ 
ధర శ్రేణి రూ.55.27 లక్షలు–రూ.1.09 కోట్లు


న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా’ తాజాగా తన లగ్జరీ బ్రాండ్‌ ‘లెక్సస్‌’ను ఎట్టకేలకు భారత్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ తాజాగా ‘లెక్సస్‌’ బ్రాండ్‌ కింద ‘ఆర్‌ఎక్స్‌ 450హెచ్‌’, ‘ఈఎస్‌ 300హెచ్‌’, ‘ఎల్‌ఎక్స్‌ 450డీ’ అనే మూడు మోడళ్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఆర్‌ఎక్స్‌ 450హెచ్‌ మోడల్‌ ప్రధానంగా ‘ఆర్‌ఎక్స్‌ లగ్జరీ’, ‘ఆర్‌ఎక్స్‌ ఎఫ్‌ స్పోర్ట్‌’ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి ధరలు వరుసగా రూ.1.07 కోట్లు, రూ.1.09 కోట్లుగా ఉన్నాయి.

ఇక ‘ఈఎస్‌ 300హెచ్‌’ ధర రూ.55.27 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. ఇక టాప్‌ ఎండ్‌ ఎస్‌యూవీ ‘ఎల్‌ఎక్స్‌ 450డీ’ ధర తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఐదవ జనరేషన్‌ లెక్సస్‌ ఎల్‌ఎస్‌ 500 కారును కూడా ప్రదర్శనకు ఉంచింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.  తాజా మోడళ్లు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని డీలర్‌షిప్స్‌ వద్ద కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని లెక్సస్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ యొషిహిరో సావా పేర్కొన్నారు. చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, కొచ్చి ప్రాంతాల్లో సర్వీస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. టయోటా కంపెనీ లెక్సస్‌ బ్రాండ్‌తో దేశీ లగ్జరీ కార్ల విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు