ఆ టీవీ అమ్మకాలు షురూ!

17 Jun, 2016 15:13 IST|Sakshi
ఆ టీవీ అమ్మకాలు షురూ!

మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ లనుంచి ఇక బయటపడట్టే. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కనిపెట్టిన దోమలను తరిమే సరికొత్త సాధనం "మస్కిటో రిపెల్లింగ్ టీవీ" అమ్మకాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారత్ లో ఈ టీవీ అమ్మకాలను చేపడుతోంది. సరికొత్త మస్కిటో ఎవే టెక్నాలజీని అల్ట్రా సోనిక్‌ తరంగాలతో ఎల్ జీ ఈ టీవీని రూపొందించింది. ఈ తరంగాలతో దోమల చెవులు బద్దలై, ఇంట్లో నుంచి పారిపోతయాని కంపెనీ వెల్లడించింది. దీనికి సమానమైన టెక్నాలజీ ఎయిర్ కండీషనర్స్, వాషింగ్ మెషిన్స్ లో కూడా వాడటానికి చెన్నైకి దగ్గర్లోని ఓ ల్యాబోరేటరీ నుంచి సర్టిఫికేట్ పొందామని ఎల్జీ తెలిపింది. టీవీ స్విచ్ ఆఫ్ చేసినా ఈ టెక్నాలజీ పనిచేసేలా రూపొందించామని, రెండు మోడల్స్ లో ఇది లభ్యమవుతోందని కంపెనీ పేర్కొంది.

ఒకటి రూ.26,500 కు, మరొకటి రూ.47,500లకు మార్కెట్లోకి తీసుకొచ్చామని ఎల్జీ ప్రకటించింది. దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి అల్ప ఆదాయ వినియోగదారులను రక్షించి, ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో దీన్ని రూపొందించామని పేర్కొంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ లో వచ్చే నెలనుంచి అమ్మకాలు చేపడతామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారి కిమ్ సుంగ్ యేల్ తెలిపారు. లాటిన్ అమెరికాను గడగడలాడించిన జికా వైరస్ ప్రభావంతో ఈ టీవీ రూపకల్పనకు ఎల్జీ శ్రీకారం చుట్టింది. ఈ జికా వైరస్ ప్రభావం రియో నగరంలో కూడా ఉందని ఆగస్టులో జరగబోయే ఒలంపిక్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ వెల్లువెత్తిన క్రమంలో ఎల్జీ ఈ వినూత్న సాధనాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసింది. 

మరిన్ని వార్తలు