స్మార్ట్‌ సీలింగ్‌ ఫాన్స్‌.. స్పెషల్‌ ఏంటి?

3 Jul, 2019 17:49 IST|Sakshi

సీలింగ్‌ ఫ్యాన్‌ సెగ్మెంట్‌లోకి ఎల్‌జీ

వై ఫై ఎనేబుల్డ్‌ సీలింగ్‌ ఫ్యాన్స్‌

ఆలెక్సీ, గూగుల్‌ అసిస్టెంట్‌,  రిమోట్‌ అనుసంధానం

ధర  రూ రూ.14వేలు.

సాక్షి, చెన్నై: దక్షిణ కొరియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మేజర్ ఎల్‌జీ  సీలింగ్‌ ఫ్యాన్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. భారత్‌ మార్కెట్లో  స్మార్ట్‌ఫీచర్లతో  ప్రీమియం సీలింగ్‌ ఫ్యాన్‌లను లాంచ్‌ చేసింది. ప్రస్తుతానికి  చెన్నైలో  లాంచ్‌ చేసింది.  వీటిని త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సీలింగ్‌ ఫ్యాన్‌ ధరను రూ. 13,990గా నిర్ణయించింది. 

దేశంలో గృహోపకరణాలు, ఎయిర్ సొల్యూషన్స్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారత మార్కెట్లో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ఎంట్రీ ఎచ్చింది ఎల్‌జీ. అత్యాధునిక ఫీచర్లను జోడించి  ప్రీమియం ధరల్లో 5 రకాల సీలింగ్‌ ఫ్యాన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.  వై-ఫై  ఆధారితంగా,  సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో  లాంచ్‌  చేశామని ఎల్‌జీ తెలిపింది.  ముఖ్యంగా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ టక్నాలజీకి అనుసంధించామనీ,  ఐఓటి ప్లాట్‌ఫామ్ ద్వారా తీసుకొచ్చిన ఎల్‌జి స్మార్ట్‌థింక్యూ మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ ఫోన్‌ల ద్వారా రిమోట్‌గా నియంత్రించుకోవచ్చని పేర్కొంది.

 ప్రత్యేకతలు 
వై ఫై ఆధారితం
అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ అనుసంధానం
వాతావరణానికి అనుకూలంగా  స్పీడ్‌ కంట్రోల్‌ ,
తక్కువ శబ్దం,  రిమూవబుల్‌ పార్ట్స్‌,  రిమోట్‌
సులువుగా  ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం

మరిన్ని వార్తలు