దోమల్ని తరిమే స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది..

28 Sep, 2017 08:55 IST|Sakshi

‘కే7ఐ’ను ఆవిష్కరించిన ఎల్‌జీ
 

న్యూఢిల్లీ: దోమలను తరమడానికి జెట్‌ కాయిల్స్‌ను, బాడ్మింటన్‌ రాకెట్స్‌ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. ప్రముఖ మొబైల్‌ హ్యాడ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఎల్‌జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో ‘కే7ఐ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,990. మస్కిటో అవే టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 5 అంగుళాల డిస్‌ప్లే,  2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని పొందుపరిచింది.

మార్కెట్‌లోకి 4జీ సీసీటీవీలు
వొడాఫోన్‌తో  వీడియోకాన్‌ వాల్‌కామ్‌ జట్టు
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సెక్యూరిటీ, నిఘా సొల్యూషన్‌ ప్రొవైడర్‌ సంస్థ వీడియోకాన్‌ వాల్‌కామ్‌.. వొడాఫోన్‌తో జట్టుకట్టింది. విపణిలోకి తొలిసారిగా 4జీ అనుసంధానమైన సీసీటీవీ కెమెరాలను విడుదల చేసింది. ఇందులో 4జీ సిమ్‌తో పాటూ మొబైల్‌ వాహన కిట్, 4జీ అవుట్‌డోర్, ఇన్‌డోర్‌ సీసీటీవీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ మొబైల్‌ వాహన కిట్‌ను బస్సులు, కార్లు, రైళ్లు, ట్రక్కుల వంటి అన్ని రకాల వాహనాలకు బిగించుకునే విధంగా 1.3, 2 మెగా పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది.

ఆసుస్‌ ‘వివోబుక్‌ ఎస్‌15’ @ రూ.59,990
న్యూఢిల్లీ:  ‘ఆసుస్‌’ తాజాగా కొత్త నోట్‌బుక్‌ ‘వివోబుక్‌ ఎస్‌15’ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.59,990. ఇందులో 8వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌–ఐ7 ప్రాసెసర్, 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ నానో ఎడ్జ్‌ డిస్‌ప్లే వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

మరిన్ని వార్తలు