16లెన్స్‌ల ఫోన్‌ను తయారుచేస్తోన్న ఎల్‌జీ

26 Nov, 2018 14:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భారతీయ మార్కెట్‌లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్‌ స్థాయి నుంచి హైఎండ్‌ వరకు మొబైల్‌ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్‌ కెమెరాలతో త్వరలోనే రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్‌ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్‌జీ 16 లెన్స్‌లతో ఫోల్డబుల్‌ ఫోన్‌ తయారు చేస్తున్నట్లు లెట్స్‌గో డిజిటల్‌ అనే డచ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. మాట్రిక్ ఫార్మాట్‌లో లెన్స్‌ను అమరుస్తున్న ఈ ఫీచర్‌పై ఎల్‌జీ పేటెంట్‌ రైట్స్‌ తీసుకుంది.

ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన అన్నీ లెన్స్‌ల నుంచి ఫోటో తీసి, అందులో నిర్ణీత లెన్స్‌ ద్వారా కాప్చర్‌ చేసిన పోటోలోని భాగాలను అవసరం లేదనుకుంటే తొలగించే ఆప్షన్‌ను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. ఈ లెన్స్‌ల ద్వారా తీసే ఫోటోలోని భాగాన్ని మరో ఫోటొతో మెర్జ్‌ చేసే ఫీచర్‌ కూడా సాధ్యమవుతుందని ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది. మొబైల్‌ వెనుక వైపున టచ్‌పాడ్‌ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్లకు అవసరమయ్యే స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇది మాత్రమేగాక ఫోన్‌ బ్యాక్‌పానెల్‌లో స్పీకర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు