ఎల్‌ఐసీ ప్రీమియం గడువు పొడిగింపు

12 Apr, 2020 05:15 IST|Sakshi

ముంబై: కోవిడ్‌–19 కారణంగా వాయిదాల చెల్లింపు గడువును 30 రోజుల పాటు పెంచుతున్నట్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. లాక్‌ డౌన్‌ కారణంగా పాలసీదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున మార్చి, ఏప్రిల్‌ గడువుల చెల్లింపులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. గ్రేస్‌ పీరియడ్‌ మార్చి 22తో ముగిసినా ఏప్రిల్‌ 15వరకూ అనుమతిస్తున్నట్లు తెలిపింది. సర్వీసు చార్జీలు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొంది. మొబైల్‌ యాప్‌ ఎల్‌ఐసీ పే డైరెక్ట్, నెట్‌ బ్యాంకింగ్, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పే, భీమ్, యూపీఐల ద్వారా చెల్లించవ్చని తెలిపింది.

ఐడీబీఐ, యాక్సిస్‌ బ్యాంకుల వద్ద, కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ (సీఎస్సీ)ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. కోవిడ్‌ –19తో మరణించిన 16 మంది పాలసీదారుల సంబంధీకులకు డబ్బులు చెల్లించినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను జూన్‌ 30 వరకూ పెనాల్టీ లేకుండానే చెల్లించవచ్చని తపాశాల శాఖ ప్రకటించింది. వీటిలో పోస్టల్‌ లైఫ్‌ న్సూరెన్స్, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలున్నాయి. రిజిస్టర్డ్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారులు ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు