ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు

17 Oct, 2015 02:01 IST|Sakshi
ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు

భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు 2015 సంవత్సరానికిగాను గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. కార్పొరేట్ గవర్నెర్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్‌ఐసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ తరఫున ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్ చీఫ్ మేనేజర్ కేఆర్ అశోక్ ఈ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ కేబినెట్ మంత్రి, డ్యూష్ ఆఫ్ లాన్‌కాస్టర్ చాన్సలర్ ఆలీవర్ లిట్‌విన్ అవార్డులను ప్రదానం చేశారు. లుక్రామ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ మిలింద్ కాంగ్లే, హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీల కో-చైర్మన్ గోపీచంద్ పీ హిందూజా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ ప్రెసిడెంట్  లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అహ్లువాలియా(రిటైర్డ్),  రీడింగ్ వెస్ట్ పార్లమెంట్ సభ్యులు (బ్రిటన్) అలోక్ శర్మ తదితరులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు