ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘2020 హోమ్‌లోన్‌’ ఆఫర్‌

15 Jan, 2020 10:58 IST|Sakshi

ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ‘2020 హోమ్‌లోన్‌ ఆఫర్‌’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్‌) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే అది అమలవుతుంది) నుంచి చెల్లించే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది.

ఈ కాలంలో రుణంపై వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలో వడ్డీతోపాటు, అసలు కూడా కొంత మొత్తం కలసి ఉంటుంది. ఇక నివాసానికి సిద్ధంగా ఉన్న ఇంటికి రుణం తీసుకుంటే రుణకాల వ్యవధిలో 6 ఈఎంఐలను సంస్థ రద్దు చేస్తుంది. 5వ ఏట, 10వ ఏట, 15వ ఏట ముగిసిన వెంటనే రెండేసి ఈఎంఐలను మాఫీ చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం క్రమం తప్పకుండా రుణానికి ఈఎంఐలను చెల్లిస్తూ ఉండాలి. అలాగే, రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలోపు ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించేయకూడదు. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా