టిగోర్‌ తొలి వార్షికోత్సవం, కొత్త ఎడిషన్‌

13 Jun, 2018 17:31 IST|Sakshi
టాటా టిగోర్‌ బుజ్‌

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తన కొత్త తరం కాంపాక్ట్‌ సెడాన్‌ టిగోర్‌ తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓ లిమిటెడ్‌ ఎడిషన్‌ను కూడా టాటా మోటార్స్‌ బుధవారం లాంచ్‌ చేసింది. టిగోర్‌ బుజ్‌ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. పెట్రోల్‌ ఎడిషన్‌ ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.5.68 లక్షలు కాగ, డీజిల్‌ వెర్షన్‌ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎక్స్‌టీ ట్రిమ్‌ ఆధారితంగా ఈ వార్షికోత్సవ మోడల్‌ రూపొందింది. ఫైవ్‌-స్పీడు మాన్యువల్‌ ట్రాన్సమిషన్‌ను ఇది కలిగి ఉంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌లో కొన్ని అదనపు ఫీచర్లున్నాయి. గ్లాసీ బ్లాక్‌ పేయింటెడ్‌ రూఫ్‌, పియానో బ్లాక్‌ అవుట్‌సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్స్‌, డ్యూయల్‌-టోన్‌ వీల్‌ కవర్‌, ఫ్రంట్‌ గ్రిల్‌ విత్‌ కలర్డ్‌ ఇన్‌సర్ట్‌, లిమిటెడ్‌ ఎడిషన్‌ బ్యాడ్జ్‌, ప్రీమియం ఫుల్‌ ఫ్యాబ్రిక్‌ సీట్స్‌ దీనిలో అదనపు ఫీచర్లు. 

స్టాండర్డ్‌ టిగోర్‌ ఎక్స్‌టీ వేరియంట్‌ కంటే ఇది 12 వేల రూపాయలు అధికం. నేటి నుంచి కంపెనీకి చెందిన అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ టాటా టిగోర్‌ బుజ్‌ ఎడిషన్‌ లభ్యం కానుంది. గతేడాది కంపెనీ లాంచ్‌ చేసిన టాటా టిగోర్‌ కంపెనీ కొత్త జనరేషన్‌ ఇంపాక్ట్‌ డిజైన్‌ ఫిలాసఫీలో మార్కెట్‌లోకి వచ్చింది. 1.2 లీటరు పెట్రోల్‌, 1.0 లీటరు డీజిల్‌ ఆప్షన్లను అది కలిగి ఉంది. మల్టి డ్రైవ్‌ మోడ్స్‌(ఎకో, సిటీ) రెండింటిన్నీ ఆఫర్‌ చేస్తుంది. ఆ కారులో డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ విత్‌ ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, కార్నర్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, రివర్స్‌ పార్క్‌ అసిస్ట్‌ విత్‌ కెమెరా ఉన్నాయి. టాటా టిగోర్‌, మారుతీ సుజుకి డిజైర్‌, హ్యుందాయ్‌ ఎక్స్‌సెంట్‌, ఫోర్డ్‌ ఆస్పైర్‌, హోండా అమేజ్‌, ఫోక్స్‌వాగన్‌ అమియోలకు గట్టి పోటీగా ఉంది.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు అందనున్న వేతనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 5,006 కోట్లు

జీఎస్‌టీ లేకుండా ఇల్లు కొంటారా?

సెకండ్స్‌ హోమ్‌!

ప్రారంభాల్లో క్షీణత విక్రయాల్లో వృద్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ అసలు సిసలైన జెంటిల్‌మెన్‌ : హీరోయిన్‌

తన వెడ్డింగ్‌ కార్డు షేర్‌ చేసిన దీపికా

నా భార్యతో కలిసి నటించను : హీరో

‘పింక్‌’ రీమేక్‌తో రీ ఎంట్రీ

త్రిష ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

యాసిడ్‌ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు