లినెన్‌ రిటైల్‌లోకి ‘లినెన్‌ హౌజ్‌’

10 Sep, 2019 13:05 IST|Sakshi
బ్రాండ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి రశ్మి గౌతమ్‌తో డైరెక్టర్లు

ఏడాదిలో 100 స్టోర్ల ఏర్పాటు

విస్తరణకు రూ.50 కోట్లు వ్యయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లినెన్‌ వ్రస్తాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్‌ లినెన్‌ హౌజ్‌ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్‌ హౌజ్‌ను ప్రమోట్‌ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్‌ డైరెక్టర్‌ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్, త్రిపురనేని విజయ్, ఉప్పలపాటి కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఫ్రాంచైజీ భాగస్వామి రూ.10–15 లక్షల పెట్టుబడి పెడితే చాలు. రూ.50 లక్షల వరకు విలువైన సరుకును కంపెనీయే సరఫరా చేస్తుంది. వ్యాపారులకు 35 శాతం మార్జిన్‌ ఉంటుంది. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడం ద్వారా 100 ఔట్‌లెట్ల స్థాయికి చేరాలని కృతనిశ్చయంతో ఉన్నాం.  రూ.50 కోట్ల దాకా వెచి్చస్తాం. ప్రస్తుతం లినెన్‌ ఫియెస్టా, లినెన్‌ మాయెస్ట్రో, లినెన్‌ ఓసియన్, బాలేశ్వర్‌ సింథటిక్స్, ప్యూర్‌ఫైన్‌ ఫ్యాబ్రిక్స్‌ కంపెనీలతో జట్టుకట్టాం. ఆదిత్య బిర్లా, రేమండ్స్, సియారామ్స్‌తో చర్చిస్తున్నాం. టాప్‌ బ్రాండ్ల లినెన్‌ ఉత్పత్తులన్నీ విక్రయిస్తాం’ అని వివరించారు.

మరిన్ని వార్తలు