ఎస్‌ఎంఎస్‌తో పాన్‌-ఆధార్‌ అనుసంధానం

31 May, 2017 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానాన్ని ఆదాయ పన్ను శాఖ మరింత  సరళ తరం చేసింది. కేవలం ఒక ఎస్‌ఎంఎస్‌ ద్వారా పాన్‌ నంబర్‌కు ఆధార్‌చ నంబర్‌ను లింక్‌ చేసే విధానాన్ని బుధవారం ప్రకటించింది.  ఈ మేరకు పన్నుచెల్లింపుదారులు తమ ఆధార్‌ కార్డు  నెంబరును అనుసంధానం చేయాల్సిందిగా కోరింది.

ఇటీవల ఐటీ వెబ్‌సైట్‌లో ఆధార్‌ లింక్‌ కోసం కొత్త  లింక్‌ను ప్రకటించిన ఐటీ శాఖ తాజాగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆధార్‌ను లింక్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది.  ప్రముఖ జాతీయ దినపత్రికలలో  జారీ చేసిన ప్రకటనల్లో  ఎస్‌ఎంఎస్‌ ద్వారా వీటిని  ఎలా లింక్ చేయాలో వివరించింది. పాన్‌, ఆధార్‌ నెంబర్లను 567678  లేదా 56161 నెంబర్లకు  ఎస్‌ఎంఎస్‌ సెండ్‌ చేయాలని చెప్పింది. మరిన్ని వివరాలకు ఐటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కోరింది.  
కాగా   జూలై 1, 2017 నుండి  పాన్‌ కార్డు  దరఖాస్తు కు  ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు