లింక్డ్‌ఇన్‌ సీఈవో రాజీనామా

6 Feb, 2020 11:16 IST|Sakshi


సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్‌ఇన్ సీఈవో జెఫ్ వీనర్(49) తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా  11 సంవత్సరాల పాటు సంస్థకు సేవలందించిన వీనర్‌ తాజాగా ఈ పదవి నుంచి తప్పుకున్నారు. జెఫ్ వీనర్  ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారనీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రోస్లాన్‌ స్కీ జూన్ 1వ తేదీనుంచి సీఈవోగా బాధ్యలను స్వీకరించనున్నారని మైక్రోసాఫ్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  లింక్డ్‌ఇన్‌లో 10 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ర్యాన్‌ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ‍్లకుకు రిపోర్ట్ చేస్తారని  వెల్లడించింది.

తన రాజీనామాపై స్పందించిన వీనర్‌ గత పదకొండు సంవత్సరాలు తన జీవితంలో గొప్ప వృత్తిపరమైన అనుభవాన్నందించాయని పేర్కొన్నారు. ఇందుకు లింక్డ్‌ఇన్‌ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు  ఉత్సుకతగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. తదుపరి సీఈవో ర్యాన్‌కు  శుభాకాంక్షలు తెలిపారు. 2008లో లింక్డ్‌ఇన్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, రోస్లాన్‌ స్కీ 2009లో కంపెనీలో చేరారు. కాగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్‌ తొలిసారి  2011లో పబ్లిక్ ఆఫరింగ్ (స్టాక్)కు వచ్చింది. మైక్రోసాఫ్ట్ 2016 లో కొనుగోలు చేసింది. లింక్డ్ఇన్ ఆదాయం 12 నెలల్లో 78 బిలియన్ డాలర్ల నుండి 7.5 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని కంపెనీ తెలిపింది. సంస్థలో సభ్యులు కూడా  33 మిలియన్ల నుండి 675 మిలియన్లకు పైగా పుంజుకుంది. 

మరిన్ని వార్తలు