గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్‌

7 Feb, 2019 15:04 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆర్‌బీఐ పాలసీ రివ్యూలో వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపడంతో  గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు  తగ్గుముఖం పట్టనున్నాయి.  రెపో రేటుపై  పావు శాతం లేదా 25  బేసిస్‌ పాయింట్లు తగ్గడం గృహ, వాహన రుణగ్రహీతలకు శుభపరిణామమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

వడ్డీరేట్ల కోత విధించి గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర బ్యాంకు శుభవార్త అందించిందని పేర్కొన్నాయి. ఈ సవరించిన రేట్లను బ్యాంకులు వినియోగదారులక పాస్ చేస్తాయని తాము భావిస్తున్నామని నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ చెప్పారు. ఇది కస్టమర్ల కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేస్తుంది. కొంతకాలంగా డిమాండ్‌ లేక నీరసించిన రియల్‌ రంగ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. 

కీలక వడ్డీరేట్లపై  ఆర్‌బీఐ యధాతథానికే మొగ్గు చూపనుందన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా మానిటరీ పాలసీ కమిటీ స్పందించింది. వరుస యథాతథ పాలసీకి చెక్‌ చెబుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని కమిటీ రెపో రేట్‌ కోతకే మొగ్గు చూపింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి  6.25 శాతానికి దిగి వచ్చింది. రివర్స్‌ రెపో 6 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలు కానుంది. 

మరిన్ని వార్తలు