మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు

4 May, 2020 11:52 IST|Sakshi

దుకాణాల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు

సాక్షి, ముంబై : మద్యం దుకాణాలకు షరతులతో కూడిన అనుమతి లభించడంతో నష్టాల మార్కెట్లో కూడా  పలు లిక్కర్ షేర్లు దూసుకుపోతున్నాయి. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో  సోమవారం లిక్కర్‌ స్టాక్స్‌ ఫుల్‌ జోష్‌లో ట్రేడవుతున్నాయి. దాదాపు 11శాతం వరకు ఎగిసాయి. జీఎం బ్రూవరీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్  బ్రూవరీస్, రాడికో ఖైతాన్, గ్లోబస్ స్పిరిట్స్,  యునైటెడ్ బ్రూవరీస్,  యునైటెడ్ స్పిరిట్స్ ఈ రోజు ఇంట్రా-డే లో 4 నుండి 11 శాతం వరకు లాభపడుతున్నాయి.  కరోనా వైరస్ ఉధృతికి అడ్డు కట్టపడకపోవడంతో  మే 17 తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 1712 పాయింట్లకుపైగా కుప్ప కూలి 32వేల స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. (లాక్‌డౌన్ ‌3.0 : సెన్సెక్స్ ఢమాల్)

లాక్‌డౌన్‌తో గత త్రైమాసికంలో మద్యం అమ్మకాల వాల్యూమ్స్‌ గణనీయంగా పడిపోనున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో యునైటెడ్‌ బ్రేవరీస్‌ తమ వాల్యూమ్స్‌లో 15శాతం క్షీణతను అంచనావేసింది.  అయితే అధిక ధరల కారణంగా కంపెనీలకు మార్జిన్స్‌ మరింత పెరగనున్నాయనీ, అమ్మకాలు తగ్గడంతో ఆపరేటింగ్‌ మార్జింగ్‌ క్షీణతను నమోదు చేసే అవకాశముందని ఎంకే గ్లోబల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది. (జియో మరో భారీ డీల్ )

మరోవైపు దేశవ్యాప్తంగా  షరతులతో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో  మద్యం ప్రియులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరడం  గమనార్హం. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం,  రెడ్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలను ( స్టాండ్ ఎలోన్) తెరవడానికి అనుమతిస్తారు. అయితే దేశవ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్లలో మద్యం  విక్రయాలకు అనుమతి లేదు.  (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ)


 

మరిన్ని వార్తలు