లాక్‌డౌన్‌ సడలింపులు : రుపీ జంప్‌

1 Jun, 2020 16:08 IST|Sakshi

సాక్షి, ముంబై:  వరుసగా నాలుగో రోజు కూడా  దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు, కరోనా వైరస్‌ కట్టడికి విధించిన రెండు నెలల లాక్‌డౌన్‌ నుంచి సడలింపుల నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న ఆశల మధ్య దేశీయ కరెన్సీ రూపాయి  లాభాలతో ముగిసింది. అమెరికా డాలర్‌తో   పోలిస్తే రూపాయి 75.35 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.29 ను తాకింది. చివరకు 75.47  వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో 75.62 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సంకేతాలకు తోడు, దేశీయంగా లాక్‌డౌన్‌ సడలింపులతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా ర్యాలీ అయ్యాయి. కీలక  సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి.  ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి కీలక సూచీ సెన్సె‍క్స్‌​ 1250 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ కూడా 9900  స్థాయిపైకి చేరింది.  అయితే ఆఖరి గంటలో అమ్మకాలతో  ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స​ 879  పాయింట్ల లాభంతో  33303 వద్ద, నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9826 వద్ద ముగిసాయి. అన్ని రంగాలు లాభాలనార్జించాయి. ముఖ్యంగా  బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్స్‌, ఆటో, మెటల్‌ రంగాలు లాభాలతో కళ కళలాడాయి. యాక్సిస్ బ్యాంక్,  టాటా స్టీల్ , బజాజ్ ఫైనాన్స్,  ఇండస్‌ ఇండ్‌ టాప్‌ విన‍్నర్స్‌గా నిలిచాయి. (సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్‌)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు