ఉబెర్‌కు భారీ షాక్‌

22 Sep, 2017 19:10 IST|Sakshi

లండన్‌: లండన్‌లో  ప్రయివేట్‌ క్యాబ్‌ అగ్రిగేటర్‌  ఉబెర్‌కు భారీ షాక్‌ తగిలింది.  ప్రజల భద్రత, ఇతర సెక్యూరిటీ  అంశాలు  తదితర పలు   విషయాల పరిశీలన అనంతరం ఉబెర్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించలేమని  లండన్‌   ట్రాన్స్‌పోర్ట్‌ అధారిటీ స్పష్టం చేసింది. ప్రైవేట్ క్యాబ్‌  సర్వీస్‌ ప్రొవైడర్‌గా పని చేయడానికి  ఉబెర్‌ ఫిట్‌ అండ్‌ ప్రోపర్‌గా లేదని వ్యాఖ్యానించింది. అలాగే సంస్థ ప్రవర్తన ,  విధానం , కార్పొరేట్ బాధ్యత లేకపోవటం తదితర కారణాల రీత్యా ఉబెర్‌ లెసెన్స్‌ను రెన్యువల్‌ చేయలేమని లండన్‌  రవాణా అధికారి శుక్రవారం వెల్లడించారు.  

అలాగే   సంస్థపై తీవ్రమైన నేరారోపణలకు సంబంధించిన కంపెనీ విధానం సరిగా లేదని పేర్కొంది.  యాప్‌ను పర్యవేక్షించే స్టాప్‌వేర్‌ వినియోగం గురించి కూడా   ప్రస్తావించింది.   దీనికి సంబంధించి  ట్విట్టర్‌లో  ఒక ప్రకటన చేసింది. మరోవైపు ఈ నిర్ణయం అప్పీల్ కు వెళ్లేందుకు ఉబెర్‌కు 21 రోజుల గడువు ఉంది.  అయితే   ఈ గడువు కాలంలో ఉబెర్‌ తన  కార్యకలాపాలను కొనసాగించవచ్చు.

కాగా ఉబెర్  లైసెన్స్  ఈ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. నగరంలో 40వేల మంది డ్రైవర్లతో 3.5 మిలియన్ల మంది లండన్ వాసులకు సర్వీసులను అందిస్తోంది.   టీఎఫ్‌ఎల్‌ నిర్ణయంపై వెంటనే తాము  సవాలు చేయాలని భావిస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని    స్థానిక ఉబెర్‌  జనరల్ మేనేజర్ టామ్ ఎల్విడ్జ్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు