ఓబీసీ నష్టం రూ.1,750 కోట్లు

9 Nov, 2017 00:25 IST|Sakshi

నాలుగింతలైన కేటాయింపులు

స్వల్పంగా తగ్గిన నికర ఎన్‌పీఏలు

ముంబై: ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.153 కోట్ల నికర లాభం సాధించామని, కానీ ఈ క్యూ2లో రూ.1,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం బాగానే పెరిగినప్పటికీ,  మొండి బకాయిలకు కేటాయింపులు నాలుగు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని వివరించింది. ఇతర ఆదాయం 82 శాతం వృద్ధితో రూ.1,059 కోట్లకు, నిర్వహణ లాభం 62 శాతం వృద్ధితో రూ.1,551 కోట్లకు పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.775 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.3,281 కోట్లకు చేరాయని,  ఈ క్యూ1లోని కేటాయింపులు(రూ.1,470కోట్లు)తో పోల్చితే దాదాపు రెట్టింపయ్యాయని వివరించింది.  

స్థూల మొండి బకాయిలు రూ.24,409 కోట్లనుంచి రూ.26,432 కోట్లకు పెరగ్గా, నికర మొండి బకాయిలు రూ.14,809 కోట్ల నుంచి రూ.14,129 కోట్లకు తగ్గాయని ఓబీసీ తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 14.83 శాతం నుంచి 16.3 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 9.56 శాతం నుంచి 9.44 శాతానికి తగ్గాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,316 కోట్ల నుంచి 5 శాతం క్షీణించి రూ.1,252 కోట్లకు తగ్గిందని వివరించింది. రుణాలు 5 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణాలు 0.3 శాతం క్షీణించాయి.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్‌ 6 శాతం క్షీణించి రూ.128 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు 4,874 కోట్లు

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

లాభాల్లోకి పీఎన్‌బీ

ఊహించినట్టుగానే జీఎస్‌టీ తగ్గింపు

జియో జైత్రయాత్ర

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

డిసెంబర్‌ నాటికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు

జెట్‌ రేసులో ఇండిగో!

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..