ఎల్‌ అండ్‌ టీ లాభాలు 32శాతం జంప్‌

11 Nov, 2017 18:54 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దిగ్గజం  లార్సన్‌ టుర్బో (ఎల్‌అండ్‌టీ) శనివారం క్యూ2  ఫలితాలను వెల్లడించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 32శాతం  జంప్‌ చేసి రూ. 2020 రూ. కోట్లను  నమోదు చేసింది.  నిర్వహణ లాభం(ఇబిటా) స్వల్పంగా పుంజుకొని రూ. 2960 కోట్లుగా నిలిచింది.  అలాగే రూ. 137 కోట్లమేర వన్‌ టైమ్‌ గెయిన్‌ నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది.

మొత్తం ఆదాయం 6శాతం పెరిగి రూ. 26,447 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 9.2 శాతం నుంచి 11.2 శాతానికి బలపడ్డాయి. మొత్తం వ్యయం 23,507 కోట్ల నుంచి రూ .24,310 కోట్లకు పెరిగింది.  కేంద్ర ప్రభుత్వ చర‍్యలు పెట్టుబడుల పునరుద్ధరణకు ఊతమిచ్చినప్పటికి  ఆర్థిక సంస్కరణల ప్రభావంతో  సవాళ్లను ఎదుర్కొన్నట్టు  కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా డీమానిటైజేషన్‌, జీఎస్‌టీ  వ్యాపారం దెబ్బతిన్నట్టు తెలిపింది.  పెట్టుబడులని ఆకర్షించడం,  ఆర్థిక సరళతకు కట్టుబడి వుండటమనే రెండు సవాళ్లు తమ ముందున్నాయని చెప్పింది.

మరిన్ని వార్తలు