ఫార్మా జోరు, లుపిన్, సిప్లా లాభాలు

3 Apr, 2020 15:04 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజాలు గురువారం నాటి నష్టాల మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది.  ఫార్మా రంగ కంపెనీలకు అవకాశాలు పెరగనున్న అంచనాల దీంతో దేశీ ఫార్మా రంగ దిగ్గజాలు లుపిన్‌ లిమిటెడ్‌, సిప్లా లిమిటెడ్ కౌంటర్లు తాజాగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోగల ప్లాంటుకి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి లోపాలులేని గుర్తింపు ఈఐఆర్‌ లభించినట్లు తాజాగా వెల్లడించింది. ఈ యూనిట్‌లో ఫిబ్రవరి 10-14 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. తద్వారా ఎలాంటి లోపాలూ బయటపడకపోవడంతో ఈఐఆర్‌ అందుకున్నట్లు లుపిన్‌ ఎండీ నీలేష్‌ గుప్తా తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాల ప్రయాణంలో  తమకు మరో ముందడుగు అని గుప్తా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లుపిన్‌ షేరు 10.3 శాతం దూసుకెళ్లి రూ. 639 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 666 వరకూ ఎగసింది. 

ఆస్త్మా, తదితర ఊపిరి తిత్తుల వ్యాధుల చికిత్సలో వినియోగించగల ఔషధం మూడో దశ క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్లు హెల్త్‌కేర్‌ దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఫ్లుటికసోన్‌ ప్రపోర్షనేట్‌ జనరిక్‌తోపాటు.. సాల్మెటరోల్‌ ఇన్‌హేలేషన్‌ పౌడర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధం అడవిర్‌ డిస్కస్‌ 110/50 ఎంసీజీకు సరిసమానంగా పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఈ ఔషధానికి అమెరికాలో వార్షికంగా దాదాపు 3 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సిప్లా షేరు దాదాపు 8 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 448 వరకూ ఎగసింది. కాగా ఆరంభం నుంచి నష్టాల మధ్య కొనసాగుతున్న కీలక సూచీలు  తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.సెన్సెక్స్  ప్రస్తుతం 609 పాయింట్లు క్షీణించి 27663 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి  8100 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు