మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు !

21 Nov, 2018 00:21 IST|Sakshi

న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు.

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. మడవగలిగే వీలున్న ఛాసిస్, దీనిపై పొడవైన డెక్‌ ఉంటుందని, స్కూటర్‌ పయ్యల కంటే చిన్న సైజు పయ్యలతో ఉండే ఈ ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌పై వ్యక్తి నిలబడి నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిని నడపటానికి  శిక్షణ అవసరమని, వీటిని దశలవారీగా ప్రవేశపెడతామని, తగిన శిక్షణను కూడా ఇస్తామని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌  వివరించారు.

మరిన్ని వార్తలు