మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ ఆటో ‘ఈ ఆల్ఫా’

19 Sep, 2017 13:34 IST|Sakshi
మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ ఆటో ‘ఈ ఆల్ఫా’

ధర రూ.1.12 లక్షలు
న్యూఢిల్లీ:
మహీంద్రా అండ్‌ మహీంద్రా గురువారం మార్కెట్లో ఈ ఆల్ఫా పేరుతో ఆటోరిక్షాను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ రూ.1.12 లక్షలుగా ప్రకటించింది. ఐదుగురు కూర్చునే సామర్థ్యం గల ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. మహీంద్రా ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయిస్తోంది. వీటిలో ఈ వెరిటో, ఈ20 ప్లస్‌ ఉన్నాయి.

చివరి మైలు వరకు చేరుకునేందుకు ఈ ఉత్పత్తి దోహదపడుతుందని ఆటో రిక్షా విడుదల సందర్భంగా ఎంఅడ్‌ఎం ఎండీ పవన్‌ గోయెంకా మీడియాతో అన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ ఫోలియో విస్తరణపై దృష్టి పెట్టామని, రానున్న రోజుల్లో ఈ విభాగం నుంచి మ రిన్ని ఉత్పత్తులు విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ విభాగంపై ఇప్పటికే రూ.500 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని, మరో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఉత్పత్తిని నెలకు 500 యూనిట్ల నుంచి రానున్న కొన్ని నెలల్లో 1,000 యూనిట్లకు, కొన్నేళ్లలో 5,000 యూనిట్లకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.  

మరిన్ని వార్తలు