మహింద్రా కొత్త మినీవ్యాన్‌, ధరెంతంటే..

13 Jul, 2017 18:24 IST|Sakshi


న్యూఢిల్లీ
: దేశీయ ఆటో దిగ్గజం మహింద్రా అండ్‌ మహింద్రా నేడు ఓ సరికొత్త వాహనాన్ని లాంచ్‌ చేసింది. జీటో మినీ వ్యాన్‌ పేరుతో రూ.3.45 లక్షలకు(ఎక్స్‌షోరూం ముంబై) స్మాల్‌ కమర్షియల్‌ వెహికిల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ ఇంజిన్‌ ఆప్షన్లో ఈ జీటో మినీవ్యాన్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు ఆకృతుల్లో ఈ వాహనం మార్కెట్లోకి రానుంది. ఒకటి హార్డ్‌ టాప్‌, రెండు సెమీ-హార్డ్‌ టాప్‌. అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మహింద్రా ఈ వాహనాన్ని ప్రవేశపెట్టింది. రెండు దశల్లో ఈ వాహనం మార్కెట్లోకి వస్తోంది. 
 
తొలుత సెమీ-హార్డ్‌ టాప్‌ డీజిల్‌ వేరియంట్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, రెండు నెలల్లో హార్డ్‌ టాప్‌ సీఎన్‌జీ, డీజిల్‌ వేరియంట్‌, సెమీ హార్డ్‌ టాప్‌ సీఎన్‌జీ, పెట్రోల్‌ వేరియంట్‌ వినియోగదారుల ముందుకు రానున్నాయి. ట్టుకుంది. ఈ వాహనం లీటరుకు 26కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వనుంది. బీఎస్‌ 4 ఉద్గారాల క్లంప్లైట్‌తోనే జీటో మినీవ్యాన్‌ రూపొందింది. త్రీ-వీలర్లు కొనుగోలుదారులను ఇది ఎక్కువగా ఆకట్టుకుంటుందని కంపెనీ చెప్పింది. మినీవ్యాన్‌ సెగ్మెంట్‌లో టాటామోటార్స్‌, పియాజ్జియోలు మార్కెట్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్నాయి.  ఈ నెలలో 12,500 యూనిట్ల జీటో మినీవ్యాన్‌లను విక్రయించాలని కంపెనీ టార్గెట్‌గా పెప్రస్తుతం మార్కెట్‌లో మహింద్రా అండ్‌ మహింద్రా మార్కెట్‌ షేరు 21 శాతముంది. ఈ వాహనం లాంచింగ్‌తో 30 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. 
మరిన్ని వార్తలు