మహీంద్రాకు మందగమనం సెగ

9 Nov, 2019 06:30 IST|Sakshi

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్‌ అంచనాలకు అందని విధంగా ఉన్నందున అమ్మకాలు, ఆదాయ అంచనాలను వెల్లడించడం లేదని కంపెనీ ఎమ్‌డీ పవన్‌ గోయెంకా వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు