మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం 

23 Nov, 2019 05:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ ‘టాప్‌ 250 నివేష్‌ యోజన’ పేరుతో కొత్త ఈక్విటీ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీం డిసెంబరు 6న ప్రారంభమై అదే నెల 20న ముగుస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో 80 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తామని కంపెనీ ఎండీ అశుతోష్‌ బిష్ణోయ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.

లార్జ్, మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో 65 శాతం వరకు ఈ పెట్టుబడి ఉంటుందని చెప్పారు. 20 శాతం వరకు డెట్, మనీ మార్కెట్‌ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ నుంచి ఇది ఎనిమిదవ పథకం. మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహిస్తున్న ఏడు ఈక్విటీ పథకాల్లో రాబడులు 17–20 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు