మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్

25 Apr, 2016 16:27 IST|Sakshi
మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో అడ్వెంచర్

మహింద్రా అండ్ మహింద్రా ఓ కొత్త మోడల్ కారు మార్కెట్లోకి వచ్చింది. న్యూ స్కార్పియో అడ్వెంచర్ మోడల్ ను ప్రారంభ ధర రూ.13.07 లక్షలతో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఎక్స్ షోరూం ఢిల్లీలో దీని ధర రూ.13.62 లక్షలుగా ఉండనుందని కంపెనీ పేర్కొంది. లిమిటెడ్ ఎడిషన్ తో ఈ వాహనాన్ని మహింద్రా అండ్ మహింద్రా మార్కెట్లోకి తెచ్చింది.

కేవలం 1,000 వాహనాలను మాత్రమే తయారు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మహింద్రా స్కార్పియో అడ్వెంచర్, స్టాండర్డ్ ఎస్10 వేరియంట్ కు చెందినది. ఎస్ 10 వేరియంట్ కు అదనంగా కొత్త ఫీచర్స్ ను, పరికరాలను పొందుపర్చి ఈ మోడల్ ను తీసుకురావడం జరిగిందని కంపెనీ తెలిపింది. స్కార్పియో రేంజ్ వాహనాల్లో ఇది తెలియని అనుభూతి కలిగిస్తుందని పేర్కొంది.

ఈ స్కార్పియోలో పొందుపర్చిన కొత్త ఫీచర్స్...గన్ మెటల్ అల్లాయ్ వీల్స్, సైడ్ ఇండికేటర్లకు ఓఆర్విఎమ్స్,  విలక్షణమైన, స్టైలిస్ గా ఉండే స్పోక్డ్ లైట్లు, అడ్వెంచర్ థీమ్డ్ గ్రాఫిక్స్ తో కూడిన సిల్వర్ అండ్ వైట్ డ్యూయల్ టోన్ ఎక్స్ టీరియర్స్ తో మార్కెట్లో ప్రవేశపెట్టారు. బ్లూ రంగు ప్యాబ్రిక్ ను కలిపిన ఓ కొత్తరకం ఫాక్స్ లెదర్ సీట్లు, ఫాక్స్ లెదర్ ర్యాపడ్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ లెవల్స్, అడ్వెంచర్ డాష్ బోర్డులో బ్యాడ్జింగ్ తో పాటు వీక్షణ కెమెరా దీనిలో ప్రత్యేకతలు.

మిగతా అన్నీ ఫీచర్స్ స్టాండర్డ్ ఎస్10 మోడళ్లకు చెందినవేనని కంపెనీ ప్రకటించింది. 2 వీల్ డ్రైవ్ కు, 4 వీల్ డ్రైవ్ కు రెంటికి స్కార్పియో అడ్వెంచర్ సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది.  2000 సీసీ, దానికంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న డీజిల్ వాహనాలకు ఢిల్లీలో నిషేధం విధించిన కారణంగా మహింద్రా స్కార్పియో అడ్వెంచర్ 2.2 లీటర్, 1.9 లీటర్ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా