నష్టాల్లోకి సూచీలు, మారుతి షైనింగ్‌

9 Dec, 2019 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 42 పాయింట్లు క్షీణించి, 40403 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 11900 వద్ద ఉంది. దాదాపు అన్నిరంగాలు నష్టపోతున్నాయి.  ప్రధానంగా యస్‌ బ్యాంకు  నష్టాల్లో టాప్‌ లో ఉంది. ఇంకా భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, ఇండస్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, సిప్లా నష్టపోతున్నాయి. మరోవైపు మారుతి సుజుకి, వేదాంతా, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మ,  టాటా స్టీల్‌, బజాజ్‌ఆటో, హీరోమోటో, ఎం అండ్‌ ఎం లాభపడుతున్నాయి. దాదాపు  ఎనిమిది నెలల తరువాత  దేశీయ ఆటో మేజర్‌ మారుతి సుజుకి ఉత్పత్తి పుంజుకుందన్నవార్తలో మారుతి లాభాల్లో ముందువరసగా వుండగా మిగిలిన ఆటో షేర్లన్నీ  కొనుగోళ్లతో పాజిటివ్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు