సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డు వివరాలు చోరి

15 May, 2018 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌లో మరో కొత్త మాల్‌వేర్‌ విజృంభించింది. ఫైర్‌బాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్లలో నిక్షిప్తం చేసుకున్న ఫైనాన్సియల్‌ డేటాను అది చోరి చేసేస్తోంది. అదే వేగా స్టీలర్‌. వేగా స్టీలర్‌ అనే కొత్త మాల్‌వేర్‌  యూజర్లు సేవ్‌ చేసుకున్న అ‍త్యంత కీలకమైన పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డుల సమాచారాన్ని ఫైర్‌బాక్స్‌, గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్ల నుంచి దొంగలిస్తుందని ప్రూఫ్‌పాయింట్‌ రీసెర్చర్లు పేర్కొన్నారు.  చిన్న చిన్నగా చేస్తున్న ఈ దాడులు, భవిష్యత్తులో వ్యాపారాలకు పెనుముప్పుగా పరిణమించనుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. వేగా స్టీలర్‌ అనేది ఆగస్ట్‌ స్టీలర్‌కు వేరియంట్‌ అని, ఇది అత్యంత కీలకమైన, రహస్యకరమైన డాక్యుమెంట్లను, క్రిప్టోకరెన్సీని, ఇతర ముఖ్యమైన సమచారాన్ని చోరి చేస్తుందని పేర్కొన్నారు.

సేవ్‌ చేసుకున్న కీలకమైన సమాచారాన్ని దొంగలించడంపైనే ఈ మాల్‌వేర్‌ ఎక్కువగా ఫోకస్‌ చేసిందని, గూగుల్‌ క్రోమ్‌, ఫైర్‌బాక్స్‌ల నుంచి పేమెంట్‌ సమాచారాన్ని చోరి చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. కీలకమైన సమాచారంలో పాస్‌వర్డ్‌లు, ప్రొఫైల్స్‌, సేవ్‌ చేసుకున్న క్రెడిట్‌ కార్డు వివరాలు, కుకీస్‌ ఉన్నాయి. కేవలం సమాచారాన్ని దొంగలించడమే కాకుండా.. ప్రభావితమైన డివైజ్‌లను స్క్రీన్‌షాట్లను తీస్తుందని, .doc, .docx, .txt, .rtf, .xls, .xlsx, or .pdf తో ముగిసే ఫైళ్లను స్కాన్‌ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్‌వేర్‌, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్‌, రిటైల్‌, తయారీ, మానవ సంబంధాల విభాగాలపై ఎక్కువగా టార్గెట్‌ చేసిందని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు