అయిదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

12 Apr, 2018 19:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతం వద్ద  అయిదు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.  అంతకు ముందు నెలలో 5.07 శాతంగా ఉంది.  ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి.  అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) వృద్ధిని సాధించింది.

సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 11.7 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల వంటి ప్రోటీన్ వస్తువుల ధరల పెరుగుదల రేటు గత నెలలో మార్చి నెలలో చాలా మోడరేట్ చేసింది.  మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన, లైట్ విభాగంలో కూడా మంత్‌ ఆన్‌ మంత్‌  ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు