రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు

6 Apr, 2020 15:40 IST|Sakshi
ఫైల్ ఫోటో

లాక్ డౌన్  ఎఫెక్ట్ ఆరున్నరేళ్ల కనిష్టానికి

మార్చి నెలలో 25 టన్నులు మాత్రమే దిగుమతి

సాక్షి, ముంబై :   కరోనా వ్యాధిని అడ్డుకునేందుకు  విధించిన దేశ వ్యాప్త లాక్ డౌన్  బంగారం దిగుమతులపై కూడా  భారీ ప్రభావాన్ని  చూపింది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు మార్చిలో రికార్డు కనిష్టానికి పడిపోయాయి.  వార్షిక  ప్రాతిపదికన  73 శాతానికి పైగా పడిపోయిన  పసిడి దిగుమతి ఆరున్నర  ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రపంచంలోనే బంగారానికి రెండో అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్‌కు మార్చి నెలలో దిగుమతులు ఏకంగా 73 శాతం పడిపోయాయి.  వాల్యూ పరంగా మార్చి దిగుమతులు దాదాపు 63 శాతం తగ్గి 1.22 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019 మార్చిలో 93.24 టన్నుల బంగారాన్ని దిగుమతి  చేసుకోగా,  ఈ ఏడాది మార్చిలో  కేవలం 25 టన్నులకు పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆరున్నర సంవత్సరాల్లో ఇదే అతితక్కువ దిగుమతి.   కోవిడ్ -19 (కరోనా) మహమ్మారి వేగంగా విస్తరింస్తుండటంతో దాదాపు ప్రపంచమంతా  లాక్‌డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం, అంతర్జాతీయ రవాణా పూర్తిగా స్తంభించిపోవటంతో దిగుమతులపై ప్రభావం పడింది.  అలాగే లాక్‌డౌన్ కారణంగా దేశంలో బంగారం దుకాణాలు  మూత పడటం ఒకప్రధాన కారణమని  బులియన్ వ్యాపారస్తులు  తెలిపారు. 

చదవండి : దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

మరిన్ని వార్తలు