కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

16 Mar, 2020 09:56 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్ మహాపతనానికి బ్రేక్‌ పడటం లేదు. కరోనా ఉగ్రరూపంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు తగ్గించడంతో మాంద్యం భయాలు వెంటాడంతో గ్లోబల్‌ మార్కెట్లు షేకవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో సోమవారం స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1825 పాయింట్ల నష్టంతో 32,271 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 10,000 పాయింట్ల దిగువన 9472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణకు ప్రణాళిక వెలువడటంతో మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో షేర్‌ 33 శాతం మేర ఎగిసింది. కరోనా వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందనే అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఆర్థిక వ్యవస్థ పెను విధ్వంసానికి లోనవుతుందనే ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు కకావికలమతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ భారీ పతనంతో తొలి 15 నిమిషాల్లోనే రూ 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

చదవం‍డి : ‘కోవిడ్‌’ కోస్టర్‌..!

మరిన్ని వార్తలు