మూడో రోజూ మార్కెట్ల జోరు

29 May, 2020 15:59 IST|Sakshi

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

32,424 పాయింట్ల వద్ద ముగింపు

రోజంతా మార్కెట్ల హెచ్చుతగ్గులు

90 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ

రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ జోరు

జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 224 పాయింట్లు పెరిగి 32,424 వద్ద నిలవగా.. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకని  9,580 వద్ద స్థిరపడింది. ఇది మూడు వారాల గరిష్టంకాగా.. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాలతో నిలవడం గమనించదగ్గ అంశం. అయితే రోజంతా మార్కెట్లు పలుమార్లు స్వల్పస్థాయిలో ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్‌ 32,480 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,824 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 9599- 9377 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. లాక్‌డవున్‌ ఎత్తివేతపై అంచనాలు, అమెరికా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు ట్రేడర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మెటల్‌, ఆటో సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో, బ్యాంకింగ్‌ 4.3-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, విప్రో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, ఐటీసీ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే యాక్సిస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో బీఎస్‌ఈలో ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌ 8.5-3.5 శాతం మధ్య ఎగశాయి.

ఐడియా జోరు
డెరివేటివ్స్‌లో ఐడియా 14 శాతం దూసుకెళ్లగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రు, పెట్రోనెట్‌, కంకార్‌, కాల్గేట్‌ పామోలివ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, జీఎంఆర్‌ 9.4-6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. అశోక్‌ లేలాండ్‌, పీఎఫ్‌సీ, జూబిలెంట్‌ ఫుడ్‌, టాటా కన్జూమర్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, టొరంట్‌ ఫార్మా, బాలకృష్ణ, రామ్‌కో సిమెంట్‌, ఎన్‌సీసీ 4-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1420 లాభపడగా.. 931 నష్టాలతో ముగిశాయి.

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2354 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 145 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 335 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2409 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4716 కోట్లు, డీఐఐలు రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా