చివరి గంటల్లో లాభాలన్నీ హుష్‌కాకి

11 Jun, 2018 16:22 IST|Sakshi

ముంబై : దేశీ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ మొదటికే వచ్చాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు, మధ్యలో ర్యాలీ తీసినా.. మళ్లీ చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో ఎక్కువ సమయం భారీ లాభాల మధ్య కదిలినప్పటికీ చివరి గంటలో భారీగా అమ్మకాల తాకిడి తగిలింది. మెటల్‌, ఎనర్జీ, రియాల్టీ స్టాక్స్‌ల్లో ఎక్కువగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంలో 35,483 వద్ద, నిఫ్టీ సైతం 19 పాయింట్ల లాభంలో 10,787 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్‌ 35,700ను అధిగమించగా.. నిఫ్టీ గరిష్టంగా 10,850ను తాకింది. 

భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, మారుతీ సుజుకీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. అయితే మరోవైపు టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంకు, హీరోమోటో, ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్‌ఐఎల్‌ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల లాభంలో 67.42గా నమోదైంది. 
 

మరిన్ని వార్తలు