ర్యాలీ బాటలో- స్వల్ప లాభాలు

8 Jun, 2020 15:52 IST|Sakshi

సెన్సెక్స్‌ 83 పాయింట్లు ప్లస్‌

ఇంట్రాడేలో 35,000 మార్క్‌ చేరువకు

25 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ

ప్రయివేట్‌ బ్యా‍ంక్స్‌, ఐటీ అండ

ఫార్మా, మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌

విదేశీ సంకేతాలు అనుకూలించడంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. అయితే తొలుత కనిపించిన స్పీడ్‌ చివరివరకూ నిలవకపోవడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 83 పాయింట్లు బలపడి 34,370 వద్ద నిలవగా.. 25 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 10,167 వద్ద స్థిరపడింది. ఆరు రోజుల ర్యాలీకి గత గురువారం బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి వారాంతాన మార్కెట్లు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో మరోసారి హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌లో కొంతమేర ఒడిదొడుకులు చవిచూశాయి. వెరసి సెన్సెక్స్‌ 34,928 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 34,212 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 10,328- 10,120 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

ఐటీ ప్లస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2-1.3 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా, ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.7-1.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఐవోసీ, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌ 7.5-4.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే జీ, శ్రీ సిమెంట్‌, ఐషర్‌, ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4.5-1.6 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, వొడాఫోన్‌ ఐడియా 15 శాతం స్థాయిలో దూసుకెళ్లగా.. అశోక్‌ లేలాండ్‌, నౌకరీ, భారత్‌ ఫోర్జ్‌, ఉజ్జీవన్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 10-7 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఎక్సైడ్‌, పీవీఆర్‌, ఇండిగో, మదర్‌సన్‌, టొరంట్‌ పవర్‌, హావెల్స్‌, కెనరా బ్యాంక్‌, వోల్టాస్‌ 8.2-4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.25-1 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1811 లాభపడగా.. 850 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 98 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2905 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 847 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు