వారాంతంలో కుప్పకూలిన సూచీలు

8 Nov, 2019 15:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వీకెండ్‌ భారీ నష్టాలను చవిచూసాయి. ప్రారంభంలోనే బలహీనంగా ఉన్నప్పటికీ ఆఖరి గంటలో అమ్మకాల జోరందుకుంది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇచ్చిన డౌన్‌ గ్రేడ్‌ రేటింగ్‌ షాక్ తగిలింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం మరింత కానసాగుతుందంటూ, భారతదేశ రేటింగ్‌ను స్థిరం నుంచి ప్రతికూలంగా మార్చడంతో కీలక సూచీలు రెండూ భారీ నష్టాలతో ముగిసాయి. ఒక దశలో 380 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌ 40300 పాయింట్ల స్థాయి, నిఫ్టీ 11900 స్థాయి దిగువకు చేరాయి. చివరకు సెన్సెక్స్‌ 330  పాయింట్లు కుప్పకూలి 40323 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 11908  వద్ద స్థిరపడ్డాయి.  తద్వారా కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకున్నాయి.

దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. ప్రధానంగా రియల్టీ,  ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా  స్వల్పంగా లాభపడగా,  ఫార్మా , ఐటీ,ఎఫ్‌ఎంసీజీ నష్టపోయాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, గెయిల్‌, యూపీఎల్‌, వేదాంతా, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌,  సిప్లా, ఐటీసీ టాప్‌ లూజర్స్‌గా నిలవగా, యస్‌ బ్యాంకు , ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్‌,  లాభడిన వాటిల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు