స్వల్ప లాభాలతో షురూ- ఫైనాన్స్‌ జోరు

8 Jul, 2020 09:32 IST|Sakshi

సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌

మెటల్‌, ఫార్మా, ఆటో, బ్యాంక్స్‌ దన్ను

ఐటీ ఇండెక్స్‌ మాత్రమే వెనకడుగు

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం ప్లస్‌

ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. తదుపరి స్వల్పస్థాయిలో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ కదులుతున్నాయి. మంగళవారం యూరోపియన్‌, యూఎస్‌ మార్కెట్లు నష్టపోగా.. ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు నీరసంగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 130 పాయింట్లు పుంజుకుని 36,804కు చేరగా.. నిఫ్టీ 44 పాయింట్లు బలపడి 10,844 వద్ద ట్రేడవుతోంది.

ఐటీ మినహా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.5 శాతం) మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఫార్మా 0.5-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో  ఇండస్‌ఇండ్, యూపీఎల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌ 3.4-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో ప్రధానంగా ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, ఎన్‌టీపీసీ 1.8-0.5 శాతం మధ్య నీరసించాయి.

శ్రీరాం అప్‌
డెరివేటివ్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెయిల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఐడియా, చోళమండలం, కెనరా బ్యాంక్‌, నాల్కో 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే కమిన్స్‌, పెట్రోనెట్‌, ఐజీఎల్‌, రామ్‌కో సిమెంట్‌, బంధన్‌ బ్యాంక్‌, ఎంజీఎల్‌, నౌకరీ, టీవీఎస్‌ మోటార్‌ 2.3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి.

>
మరిన్ని వార్తలు