మళ్లీ నష్టాలే: పీఎస్‌యూ డౌన్‌, ఐటీ, ఫార్మా షైన్‌

14 Mar, 2018 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.  ప్రపంచ మార్కెట్లు బలహీన  సంకేతాలతో సెన్సెక్స్‌ 100పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 10400 స్థాయికి దిగువకు చేరింది. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో తిరిగి అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫార్మా, ఐటి పాజిటివ్‌గా ఉంది. టీసీఎస్‌ , ఇన్ఫోసిస్‌ , అరబిందో, ఫోర్టిస్‌ తోపాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌,గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌ లాభపడుతున్నాయి. ఎస్‌బీఐ, ఐటీసీ హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ లాంటి హెవీ వెయిట్స్‌ నష్టపోతున్నాయి. వీటితోపాటు ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, యాక్సిస్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమొటో, ఐబీ హౌసింగ్‌, యస్‌బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఒడిదుడుకులతో లాభనష్టాలమధ్య ఊగిసలాడే అవకాశం ఉందని ఎనలిస్టులు సూచిస్తున్నారు.అటు మనీ మార్కెట్‌లో రుపీ  బలహీనత కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు