చివరి వరకూ నష్టాలే..10400 దిగువకు నిప్టీ

28 Nov, 2017 15:48 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.  ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఐటీ కౌంటర్లలో అమ్మకాలతో సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి  33,618 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల  నష్టంతో 10,370వద్ద ముగిసింది. తద్వారా వరుసగా 8 సెషన్ల లాభాలకు చెక్‌ చెప్పిన నిఫ్టీ 10,400 స్థాయికి దిగువన ముగిసింది.  

మెటల్‌ స్వల్పంగా లాభపడగా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, రియల్టీ, ఐటీ నష్టపోయాయి. ఎన్‌సీసీ, ఐజీఎల్‌, బయోకాన్‌, గోద్రెజ్‌ సీపీ, టాటా గ్లోబల్‌, ఎన్‌హెచ్‌పీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభాల్లో  ఆర్‌కామ్‌, ఐసీఐఎల్‌, గ్లెన్‌మార్క్‌, జైన్‌ ఇరిగేషన్‌, జీఎంఆర్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌  నష్టాల్లో ముగిశాయి.
 

మరిన్ని వార్తలు