మార్కెట్ల జోరు:10800కిపైన నిఫ్టీ

11 May, 2018 15:39 IST|Sakshi

సాక్షి, ముంబై: వారం చివరలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 290 పాయింట్లు ఎగిసి 35,535 వద్ద,నిఫ్టీ పాయింట్లు 9010,806  లాభపడి  వద్ద స్థిరంగా ముగిశాయి.  ముఖ‍్యంగా నిఫ్టీ 10800స్థాయికిపైన ముగిసింది.  ఒక దశలో 300 పాయింట్లకుపైగా పుంజుకుంది. ఆరంభంనుంచి ఉత్సాహంగాఉన్న సూచీలు   ట్రేడింగ్‌ ఆఖరు గంటలో మరింత పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి.  మెటల్‌, ఆయిల్‌  అండ్‌ గ్యాస్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ , ఐటీ, ఇతర స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌  షేర్ల ర్యాలీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. టెలికాం, ఫార్మ సెక్టార్‌  భారీగా నష్టపోగా , రియల్టీ   స్వల్పంగా నష్టపోయింది.
రిలయన్స్‌, ఐవోసీ,  హెచ్‌పీసీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, హింద్‌ కాపర్‌, టాటా స్టీల్‌, వేదాంతా, సెయిల్‌, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,ఐషర్‌ మోటార్స్‌ ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ హెచ్‌సీఎల్‌ లాభపడ్డాయి.  ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యూపీఎల్‌  లాంటి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి.  అయితే జియో దెబ్బతో ఎయిర్‌టెల్‌, ఆర్‌కాం,  ఐడియా, పీసీ జ్యుయలరీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అటు ఫారెక్స్‌ మార్కెట్లు రూపాయి నష్టాలనుంచి తేరుకుంది. డాలరు మారకంలో 0.04 పైసల లాభంతో 67.28 వద్ద ఉంది.  ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి కూడా రూ.121  పుంజుకుని పది గ్రా. 31,486 వద్ద ఉంది.

>
మరిన్ని వార్తలు