ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: రికార్డ్‌ హైలో బ్యాంక్‌ నిఫ్టీ

7 Jun, 2017 15:55 IST|Sakshi

 ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన  పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్‌బీఐ అనుసరించిన  మరోసారి యథాతథ పాలసీ ఇన్వెస్టర్లలో  ఉత్సాహాన్ని  నింపింది.  సెన్సెక్స్‌ 81 పాయింట్లు అధిగమించి 31271 వద్ద  నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 9663 వద్ద స్థిరంగా ముగిశాయి.  ముఖ్యంగా ఆర్‌బీఐ పాలసీ ప్రకటన తో ప్రభుత్వ, ప్రయివేటుబ్యాంకులతోపాటు,  హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ సెక్టార్‌లో లార్జ్‌ క్యాప్స్‌లో బైయింట్‌ ఇంట్రరెస్ట్‌ తో  మార్కెట్లలో మంచి ర్యాలీ కనిపించింది.  ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 23,606ను తాకింది.  తొలిసారి నిఫ్టీ 23,500పైన ముగిసింది.

ఎస్‌బీఐ, పీఎన్‌బీ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులు పుంజుకున్నాయి. యాక్సిస్‌, ఐసీఐసీబ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, లాభాలతో ముగిశాయి.  అలాగే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లకు డిమాండ్‌ పుట్టింది.  కేన్‌ఫిన్‌ హోమ్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, జీఐసీ హసింగ్‌, గృహ్‌ ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ తదితరాలు  లాభడ్డాయి. వీటితోపాటు అరబిందో ఫార్మ, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌  మోటార్స్‌, ఎంఅండ్‌ఎం వేదాంత లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌ లాస్ట్‌ మినిట్‌లో  లాభాల్లోకి మళ్లింది. ఐటీ ఇండెక్స్  పతనమైంది. అయితే చివరలో కొద్దిగా నష్టాలనుంచి కోలుకుంది.  రిలయన్స్‌ లాస్ట్‌ మినిట్‌లో  లాభాల్లోకి మళ్లి టాప్‌ విన్నర్‌గా నిలవడం విశేషం.

అటు డాలర్‌ మారకంలో రుపీ 0.07 పైసల లాభంతో రూ.64.36 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో రూ.70 క్షీణించి,  పదిగ్రా. రూ.29,497 వద్ద ఉంది.  

 

మరిన్ని వార్తలు