ప్రాఫిట్‌బుకింగ్‌: 34వేల దిగువకు సెన్సెక్స్‌

27 Dec, 2017 16:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డ్‌ స్థాయిల  వెనక్కి  తగ్గాయి.   ఇన్వెస్టర్ల అమ్మకాలతో న ష్టాల్లో ముగిసాయి.   ముఖ్యంగా   రికార్డ్‌ స్థాయిల నమోదు  తరువాత  రోజంతా  రేంజ్‌ బౌండ్‌లో  ట్రేడ్‌ అయిన సెన్సెక్స్‌ 99‌ క్షీణించి  34వేల దిగువకు చేరింది. నిఫ్ టీ41 పాయింట్లను కోల్పోయి 10,49 వద్ద  స్థిరపడింది. చివరి గంటలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా సాంకేతికంగా కీలకమైన స్థాయిల దిగువన ముగిశాయి.

ఫార్మా లాభపడగా,బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ  నష్టపోయాయి.  సన్‌ పార్మా 6 శాతం జంప్‌చేయగా.. టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, అరబిందో, జీ, వేదాంతా, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, లుపిన్‌ కూడాలాభాలను ఆర్జించాయి.  అలాగే ఐవోసీ, భారతీ, ఐసీఐసీఐ, అల్ట్రాటెక్, బాష్‌, టీసీఎస్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌  తదితరాలు నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు