నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

23 Oct, 2018 16:08 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ముగిశాయి.  రోజంతా నష్టాతోనే సాగి దాదాపు 400  పాయింట్ల పతనాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ చివరికి  34వేలకు దిగువనే ముగిసింది. అటు నిఫ్టీ కూడా మరో కీలక మద్దతు స్థాయి 10200ని కూడా కోల్పోయింది. వరుసగా నాలుగవ సెషన్‌లో కూడా నష్టాల బాట పట్టడం గమనార‍్హం. ముఖ్యంగా  ఐటీ ఫార్మ, ఎఫ్‌ఎంసీజీ  సెక్టార్లలో అమ్మకాలు  మార్కెట్లను ప్రభావితం చేశాయి. సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌,  విప్రో, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, అల్ట్రాటెక్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌ బీపీసీఎల్ టాప్‌  లూజర్స్‌గా నిలిచాయి.   ఐబీ హౌసింగ్‌  హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, కోల్‌ ఇండియా, టైటన్‌, హిందాల్కో, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌  లాభాల్లో ముగిసాయి.

మరిన్ని వార్తలు