ప్రీ బడ్జెట్‌ ర్యాలీ : లాభాల సెంచరీ, సరికొత్త రికార్డులు

22 Jan, 2018 09:42 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సానుకూల ప్రారంభాన్ని నమోదు  చేశాయి. సెన్సెక్స్‌ 109 పాయింట్ల లాభంతో 35,620 వద్ద, నిఫ్టీ13 పాయింట్ల లాభంతో 10,907వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ నష్టపోతుండగా,ఆయిల్‌ అండ​ గ్యాస్‌ సెక్టార్‌ లాభపడుతోంది.  వరుస లాభాలతో కొత్త  గరిష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లో సెన్సెక్స్‌ సెంచరీ  లాభాలతో  మరోసారి సరికొత్త గరిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ కూడా  నిఫ్టీ 10900 పాయింట్లను అధిగమించడం  మరో రికార్డు.  దీంతో మరో లాండ్‌మార్క్‌ 11వేల దిశగా  పయనిస్తోంది. అయితే  ప్రీ బడ్జెట్‌ ర్యాలీగా ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.   ఓఎన్‌జీసీ, హెపీసీఎల్‌ డీల్‌  వార్తలకు ఇన్వెస్టర్లు  స్పందన కనిపిస్తోంది.ఓఎన్‌జీసీ బాగా లాభతుండగా, హెచ్‌పీఎల్‌ అంతే రేంజ్‌లో నష్టపోతోంది.

డీసీఎం శ్రీరామ్‌ ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌,అదానీ   లాభపడుతుండగా   విప్రో , ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌,  హిందాల్కో,  నష్టపోతున్నాయి.  ముఖ్యంగా గృహ ఫైనాన్స్‌  షేరు  6 శాతానికిపైగా పతనమైంది.
 

మరిన్ని వార్తలు