మండిన మండే : స్టాక్‌మార్కెట్ల పతనం

24 Sep, 2018 16:29 IST|Sakshi


సాక్షి,ముంబై:  స్టాక్‌మార్కెట్లు వరుసగా అయిదో  సెషన్లో కూడా భారీగా నష్టపోయింది. దీంతో నిఫ్టీ రెండునెలల తరువాత 11వేల దిగువకు చేరింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో మొదలైన షేర్ల పతనం ఇతర రంగాలకు ఫాస్ట్‌గా పాకడంతో  కీలక సూచీలు  సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ నష్టాలను నమోదు చేసాయి.  నిఫ్టీ ఏకంగా 190 పాయింట్లకు పైగా క్షీణించింది.  దీంతో ఎంతో కీలకంగా భావిస్తున్న 11,000 దిగువన ముగిసింది.  ఇక సెన్సెక్స్‌ కూడా దాదాపు 600 పాయింట్లు పతనమైంది.  ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 536 పాయింట్లు పతనమై 36,305 వద్ద నిఫ్టీ 176 పాయింట్లు దిగజారి 10,967 వద్ద నిలిచింది.
రియల్టీ 5.5 శాతం, ఆటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 4-2 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు  ఐబీ హౌసింగ్‌, ఐషర్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

అటు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఐటీ మాత్రం లాభపడింది.  ముఖ్యంగా టీసీఎస్‌ 5 శాతం జంప్‌చేయగా, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.3-1 శాతం లాభాల మధ్య ముగిసాయి.
 

మరిన్ని వార్తలు