మార్కెట్లకు ఆర్‌బీఐ పాలసీ కిక్‌

7 Jun, 2017 15:24 IST|Sakshi
మార్కెట్లకు ఆర్‌బీఐ పాలసీ కిక్‌

ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన  పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది.   ఆర్‌బీఐ అనుసరించిన  మరోసారి యథాతథ పాలసీ ఉదయం నుంచి వేచి చూసే  దోరణితో ఉన్న ఇన్వెస్టర్లలో  ఉత్సాహాన్ని  నింపింది. దీంతో మిడ్‌  సెషన్‌ తరువాత ఫ్లాట్‌గా మారిన మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 82 పాయింట్లు అధిగమించింది.  నిఫ్టీ 23 పాయింట్లు బలపడింది. ముఖ్యంగా  పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌   బాగా లాభపడుతోంది. ముఖ్యంగా  పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌   బాగా లాభపడుతోంది.  దీంతో బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేయగా,   పీఎన్‌బీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్‌  సహా ఇతర బ్యాంకు షేర్లు లాభాలనార్జిస్తున్నాయి.  హౌసింగ్‌ ఫైనాన్స్‌  కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. డీహెచ్‌ ఎఫ్‌ల్‌ పుంజుకుంది.  ఫార్మా కూడా 1.5 శాతం లాభాలతో ఉంది.
ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో అరబిందో, రిలయన్స్‌, వేదాంతా, ఎంఅండ్‌ఎం, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్‌, మారుతీలా భాల్లోకొనసాగుతున్నాయి.  అయితే  మంగళవారం నాటి ట్రేడింగ్‌ లో బాగా బలపడిన  ఐటీ ఇండెక్స్  నేడు కుదైలేంది. టీసీఎస్‌, టెక్‌మహీంద్రా, విప్రో, బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌,  హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌  భారీగా  క్షీణించాయి.

 

మరిన్ని వార్తలు