సరికొత్త రికార్డుల మోత

30 Oct, 2017 09:30 IST|Sakshi

ముంబై : గత కొన్ని రోజులుగా మోత మోగిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా ఎగిసి, 33,285 వద్ద, నిఫ్టీ 38.45 పాయింట్ల లాభంలో 10,361 వద్ద రికార్డు గరిష్ట మార్కులను నమోదుచేస్తున్నాయి. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, వేదంత, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో బాగా లాభపడ్డాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.7 శాతం చొప్పున లాభాలు పండిస్తున్నాయి. ఫలితాల ప్రకటనాంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌తో ఐసీఐసీఐ బ్యాంకు ఒక శాతం మేర కిందకి పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు బలహీనపడి 64.89 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 52 రూపాయల లాభంలో రూ.29,322గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు