తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు: పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌

20 Feb, 2018 09:39 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అయితే వెంటనే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారి పోయాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో ..ముఖ్యంగా   ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌. నిఫ్టీ  ఫ్లాట్‌గా మారాయి.మళ్లీ  పుంజుకుని లాభాల్లో  ఉన్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 33,860  వద్ద నిఫ్టీ ఫ్లా19 పాయింట్ల నష్టంతో 10, 397వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అయినా కీలక సూచీల్లో సెన్సెక్స్‌ 34వేలకుదిగువన, నిఫ్టీ 10400 కు దిగువనే  ఉన్నాయి. అటు ఎనలిస్టులు కూడా పీఎస్‌యూ బ్యాంకు  షేర్ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచించారు.  భారీ స్కాం నేపథ్యంలో పీఎన్‌బీ 5శాతం , గీతాంజలి మరో10శాతం పతనమైంది. వీటితోపాటు ఎస్‌బీఐ, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  కోటక్‌,  తదితర షేర్లు నష్టపోతున్నాయి.   భూషణ్‌ స్టీల్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌,  ఎం అండ్‌ ఎం, జెఎస్‌ డబ్ల్యు,  బినానీ వేదాంత, టాటాస్టీల్‌, టీసీఎస్‌, లాభపడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు