దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రన్‌: సరికొత్త రికార్డు గరిష్టాలు

12 Jan, 2018 09:39 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుల్‌రన్‌ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయి. గతరెండు సెషన్స్‌గా కన్సాలిడేషన్‌ బాటలో  సాగినా తిరిగి వారాంతంలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో​ ఆరంభంలోనే  కీలక సూచీలు ఆల్‌టైం గరిష్టాలను మోదు చేశాయి. సెన్సెక్స్‌   సెంచరీ లాభాలతో 34, 600 పాయింట్లను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స​ 92 పాయింట్లు ఎగిసి34, 595వద్ద,నిప్టీ 28 పాయింట్ల  లాభంతో 10,679 వద్ద కొనసాగుతున్నాయి.  స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ దాదాపు అన్ని రంగాల్లోకు లాభాలే.  మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఆటో  సెక్టార్‌ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి.  అటు గురువారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాలను తాకడం దేశీయ మార్కెట్లకు  బూస్ట్‌ ఇచ్చినట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  

వేదాంతా, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌  లాభాల్లోనూ, క్యూ3 ఫలితాలతో టీసీఎస్ నష్టపోతోంది. అలాగే భారతీ, ఐషర్‌  స్వల్పంగా  నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు