గ్లోబల్‌ సపోర్టు : మార్కెట్లు జంప్‌

11 May, 2018 09:32 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : గ్లోబల్‌గా వస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు జంప్‌ చేశాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి ప్రతికూల ప్రభావంతో గురువారం నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు, అంతర్జాతీయ సంకేతాలతో శుక్రవారం ట్రేడింగ్‌లో తేరుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల పైగా పైకి జంప్‌ చేసింది. ప్రస్తుతం 110 పాయింట్ల లాభంలో 35,356 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు ఎగిసి 10,750 మార్కు వద్ద లాభాలు పండిస్తోంది. మిడ్‌క్యాప్స్‌ కూడా సానుకూల ధోరణిలో ప్రారంభమయ్యాయి.

మెటల్‌, ఐటీ స్టాక్స్‌తో మార్కెట్లు బలపడుతున్నాయి. టాప్‌ గెయినర్లుగా ఏసియన్‌ పేయింట్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌లు ఉండగా.. భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మాలు నష్టాలు గడించాయి. గత కొన్ని రోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి విలువ కూడా నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో బలపడింది. నిన్నటి ముగింపుకు 16 పైసలు బలపడి 67.15 వద్ద ప్రారంభమైంది. గురువారం రూపాయి విలువ 67.31కు పడిపోయిన సంగతి తెలిసిందే. ఏళ్ల గరిష్టాల్లో ట్రేడవుతున్న ఆయిల్‌ ధరలు శుక్రవారం కిందకి పడిపోవడం రూపాయికి సహకరించినట్టు తెలిసింది. 
 

మరిన్ని వార్తలు